కాడ్లూరు: ఈ మధ్య కాలంలో వివాహం బంధంతో ఒకటైన కొన్ని జంటల కథ విషాదాతం అవుతున్నాయి. వేరే వ్యక్తుల మోజులో పడి ఒకరినొకరు కడతేర్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. కొత్తగా వివాహమైన ఓ జంట ఆగారు. ఆ తర్వాత కొంత సమయానికే భర్త నీళ్లలో పడిపోయి సహాయం కోసం అరవడం మొదలు పెట్టాడు. ఈ ఘటన కాడ్లూరు సమీపంలో ఉన్న కృష్ణా నది వంతెనపై జరిగింది. భర్త నీళ్లలో పడి ప్రాణాలతో పోరాడుతుంటే.. భార్య ఆ దారిలో వెళ్తున్న వారిని సహాయం కోరింది.
ఇది గమనించిన కొందరు మత్య్సకారులు తాడు సాయంతో ఆ వ్యక్తిని కాపాడి వంతెనపైకి తీసుకువచ్చారు. అయితే తమకు ఈ మధ్య వివాహం అయిందని.. సెల్ఫీ దిగుదామని చెప్పి తన భార్యే నీళ్లలోకి తోసేసిందని కాస్త ఈత వచ్చు కాబట్టి ఎలాగోలా ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని.. ఇది తనను చంపేందుకు చేసిన కుట్ర అని భర్త ఆరోపించాడు. కానీ, భార్య మాత్రం తనకు ఏ పాపం తెలియదని.. చెప్పింది. దీంతో అక్కడి వాళ్లు ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లగా.. పెద్దల సమక్షంలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.