లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా (Team India) తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ఆరంభం నుంచి రాహుల్, పంత్‌లు పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశారు. వికెట్ కాపాడుకుంటూ స్కోర్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పంత్ అర్థశతకం కూడా సాధించాడు. అయితే బషీర్ వేసిన 66వ ఓవర్ మూడో బంతికి సింగిల్ కోసం ప్రయత్నించి పంత్ (74) రనౌట్ అయ్యాడు. దీంతో అంపైర్లు మూడో రోజు లంచ్ బ్రేక్ ప్రకటించారు. లంచ్ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. క్రీజ్‌లో ప్రస్తుతానికి కెఎల్ రాహుల్(98) ఉన్నాడు. ఇంకా భారత్ (Team India) 139 పరుగుల వెనుకంజలో ఉంది.
పంత్ రనౌట్.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -