Sunday, July 13, 2025

సంపులో పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఇంటి యజమాని నిర్లక్షానికి ముక్కుపచ్చలారాని పసిబాలుడు బలైపోయాడు. ఇంటి ఆవరణలో సంపులో పడి బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలిసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హఫిజ్ పేట్ లోని మార్తాండ నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీను, నిలా దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి అభి (4) కుమారుడు ఉన్నాడు. కూలీ పనుల కోసం శనివారం ఉదయం దపంపతులు బయటకు వెళ్లాడు. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటు ఉండగా బాలుడు

అనుకోకుండా నిటి సంపులో పడిపోయాడు. కొద్ది సేపడి తరువాత స్థానికులు బాలున్ని పరిశీలించి బయటకు తీసి కొండాపూర్ ఏరియా హస్పిటల్‌కు తరలించారు. అక్కడ డ్యూటిలో ఉన్న డాక్టర్ బాలున్ని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించాడు. ఇంటి యజామాని నిర్లక్షం వల్లనే బాలుడు మృతి చెందాడని, పలుమార్లు నిటి సంపు పై డోర్ ఏర్పాటు చేయాలని చెప్పిన పంటించుకోలేదని అద్దెకు ఉన్న స్థానికులు అంటున్నారు. ఈ మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News