పుష్ప-2 సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. ఆ తర్వాత తాను చేసే సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఎఎ22 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం వరకూ ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయెల్ రోల్‌లో కనిపిస్తారనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి అంతకు మించిన వార్త ఒకటి చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బన్నీ (Allu Arjun) ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ నడుస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ స్క్రీన్‌పై సందడి చేయనున్నారట. ఇందుకోసం హీరో లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తోంది. కానీ, చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్యారలెల్ వరల్డ్, పునర్జన్మల కాన్సెప్ట్‌తో సైన్స్‌ఫిక్షన్ కథ ఎఎ22 రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ ఈ చిత్రం కోసం పని చేస్తోంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించనున్నారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ అని టాక్. అందులో ఒకరు దీపికా పదుకొనే అని చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్య శ్రీ బోర్సేలు మిగిలిన హీరోయిన్స్‌గా చేస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.