గగన్‌యాన్ మిషన్‌కు చెందిన కీలక పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ను పూర్తిగా అభివృద్ధి చేసిన ఇస్రో.. క్వాలిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను సమగ్రంగా పరీక్షించింది. ఎస్‌ఎంపీఎస్‌కు చెందిన 350 సెకన్ల ఫుల్ డ్యూరేషన్ హాట్ టెస్ట్‌ను శుక్రవారం పూర్తి చేశారు. ఈ పరీక్షలన్నీ తమిళనాడు లోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో జరిగాయి. గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షం లోకి పంపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. హాట్ టెస్ట్ సమయంలో ప్రొపల్షన్ పెర్ఫార్మెన్స్ నార్మల్‌గా సాగిందని ఇస్రో శనివారం ప్రకటించింది.
సర్వీస్ మోడ్యూట్ ప్రొపల్సన్ సిస్టమ్‌కు సంబంధించి సిస్టమ్ డిమానిస్ట్రేషన్ మోడల్‌కు నామమాత్రపు, నామమాత్రం కానీ 25 పరీక్షలను 14,331 సెకన్ల వ్యవధిలో నిర్వహించినట్టు వెల్లడించింది. గగన్‌యాన్‌కు చెందిన సర్వీస్ మాడ్యూల్‌ను ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా రెగ్యులేట్ చేస్తారు. కక్షలో పరిభ్రమణ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్బిట్ సర్యులేషన్, ఆన్ ఆర్బిట్ కంట్రోల్, డీబూస్ట్ మాన్యువరింగ్ లాంటి ప్రక్రియలన్నీ సర్వీస్ మాడ్యూల్ చూసుకుంటుంది. ఆర్బిట్ సర్కులేషన్, డీబూస్ట్ దశల్లో లిక్విడ్ అపోజీ మోటార్ ఇంజిన్లు శక్తిని ఇస్తాయి. ఇక ఆల్టిట్యూడ్ కంట్రోల్‌ను రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ త్రస్టర్స్ చూసుకుంటాయి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ , గగన్‌యాన్ ఎస్ ఎం పీఎస్‌ను డిజైన్ చేసి , డెవలప్ చేసినట్టు ఇస్రో పేర్కొంది.