Sunday, July 13, 2025

క్యాన్సర్‌తో శివన్న పోరాటం.. డాక్యుమెంటరీ టైటిల్ ఏంటంటే..

- Advertisement -
- Advertisement -

ప్రపంచాన్ని భయపెట్టే మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి సోకి బయటపడాలంటే.. చాలా కష్టతరం. అయితే క్యాన్సర్ సోకి బయటపడిన వాళ్లలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) ఒకరు. అయితే ఆ మహమ్మారి ఆయన ఎలా జయించారో తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వార్తని నిజం చేస్తూ.. అధికారిక ప్రకటన వచ్చింది. శనివారం శివన్న పుట్టినరోజు సందర్భంగా డాక్యుమెంటరీ నుంచి ప్రకటించారు. ‘సర్వైవర్ పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీకి ప్రదీప్ కె శాస్త్రి దర్శకత్వం వహిస్తున్నారు. గీత శివరాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ డాక్యుమెంటరీ ఆగస్టులో అందుబాటులోకి రానుంది.

క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం.. ఆ వ్యాధితో బాధపడుతోన్న వారిలో ధైర్యం నింపడం కోసమే ఈ డాక్యుమెంటరీ తీసుకురావాలని అనుకుంటున్నట్లు శివన్న (Shiva Rajkumar) గతంలో చెప్పారు. అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు తనకు ఎంతో అండగా నిలిచారని. క్యాన్సర్‌పై తన పోరాటాన్ని డాక్యుమెంటరీ తీస్తే అది ఎందరిలో ధైర్యం నింపుతుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News