Thursday, August 28, 2025

కలకత్తా ఐఐఎంలో అత్యాచారం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: స్థానిక ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఐఐఎం కలకత్తా విద్యార్థినిపై ఇదే కాలేజీ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బెం గాల్‌లో వరుసగా విద్యార్థినులపై కాలేజీల్లోనే అ త్యాచారాలు, సామూహిక హింసాకాండ జరుగుతున్న దశలో ఇప్పటి ఘటన మరింత సంచలనానికి దారితీసింది. ఐఐఎం బాలుర హాస్టల్‌లోనే వి ద్యార్థి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురా లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో కి దిగారు. శుక్రవారం ఈ ఘటన జరిగిందని, వెంటనే తాము కేసు నమోదు చేసుకుని దుశ్చర్యకు పాల్పడ్డ విద్యార్థిని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఓ సబ్జెక్టులో తన డౌట్స్ తీరుస్తానని చెప్పి విద్యార్థి ఈ విద్యార్థినిని తన హాస్టల్ గదికి రప్పించాడు.మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చాడు. దీనితో యువతి స్పృహ కోల్పోయింది. ఈ దశలోనే ఆమెపై అత్యాచారం జరిపినట్లు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు ద్వారా తెలిసింది.

కొద్ది సేపటి తరువాత తేరుకున్న తనకు జరిగిందేమిటో తెలిసిందని, అక్కడే ఉన్న విద్యార్థి జరిగింది ఎవరికైనా చెపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని తెలిపింది. శుక్రవారం రాత్రి ముందుగా విద్యార్థిని అదుపులోకి తీసుకుని తరువాత అరెస్టు ప్రకటించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై హరిదేవ్‌పూర్ పోలీసు స్టేషన్ అధికారులు స్పందించారు. తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పక్షం రోజుల క్రితమే ఇక్కడి ఓ లా కాలేజీలో ఓ విద్యార్థినిపై మాజీ విద్యార్థి కాలేజీ సిబ్బందితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ప్రధాన నిందితుడికి అధికార పక్షం అయిన టిఎంసితో లింక్ ఉందనే వార్తలు రాజకీయ దుమారానికి దారితీశాయి. అంతకు ముందు కొల్‌కతాలోనే ఓ వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం తరువాతి హత్య ఘటన చెదిరిపోక ముందే వరుస ఘటనలు జరుగుతున్నాయి. దీనితో విద్యాసంస్థలలో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకం అయింది.

అత్యాచారం జరుగలేదు. ఆటో నుంచి కిందపడింది
విద్యార్థిని తండ్రి వివరణ..తప్పుడు వార్తల ఖండన
తన కూతురు అత్యాచారానికి గురైందనే వార్తలను విద్యార్థిని తండ్రి విలేకరుల సమావేశంలో ఖండించారు. కూతురు ఆటోలో వస్తుండగా కింద పడిందని వివరించారు. తనకు రాత్రి ఓ ఫోన్ వచ్చిందని, కూతురు ఆటో నుంచి కిందపడి సొమ్మసిల్లిందని తెలిపారని ఆయన చెప్పారు. ఆమెను అక్కడి పోలీసులు వెంటనే ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్‌కు తరలించారని, చికిత్స జరుగుతోందని చెప్పారు. తనపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని కూతురు తెలిపిందని , ఆమె ఇప్పుడు మామూలుగానే ఉందని తెలిపారు. ఇప్పుడు అరెస్టు అయిన విద్యార్థికి తన కూతురుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్నందున ఎక్కువగా మాట్లాడలేదని చెప్పారు. ఆమె నిద్ర లేచిన తరువాత అన్ని విషయాలు తెలుసుకుంటానని చెప్పారు. విద్యార్థి వద్దకు ఏదో ఒక డాక్యుమెంట్ ఇవ్వడానికి వెళ్లినట్లు తెలిసిందన్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తనకు పోలీసులు చెప్పారని, వైద్య పరీక్షల దశలో ఒక విషయం చెప్పాలని ఆమెపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని అయితే ఆమె అంగీకరించలేదని తండ్రి తెలిపారు. తన కూతురి విషయంలో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారనేది తెలియడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News