- Advertisement -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై మళ్లీ సుంకాల మోత మోగించారు. మెక్సికో తోపాటు ఐరోపా యూనియన్ (ఈయూ) దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమలు లోకి వస్తాయని ప్రకటించారు. అమెరికాతో ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధించడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌లకు లేఖలు రాశారు. అనధికార వలసదారులను , ఫెంటానిల్ అనే మాదక ద్రవ్యాన్ని అరికట్టడంలో మెక్సికో విఫలమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. నార్కో మాదక ద్రవ్యాల రవాణ కేంద్రంగా మారకుండా నార్త్ అమెరికాను కాపాడలేక పోతోందని ఆరోపించారు.
- Advertisement -