ఎయిర్ ఇండియా విమాన
దుర్ఘటనపై తేల్చిన నివేదిక
రెండు ఇంజిన్ల ఇంధన
స్విచ్‌లు కటాఫ్ తొమ్మిది
సెకన్లలో ప్రమాదం పైలట్లదే
బాధ్యత అంటున్న నివేదిక
ఖండించిన పైలట్ల సంఘం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర వి మాన ప్రమాద ఘటనపై అత్యంత కీలక విష యం వెలుగులోకి వచ్చింది. జూన్ 12వ తేదీన ఎయిరిండియా విమానం ఎఐ171 రన్‌వే మీది నుంచి పైకి వెళ్లిన సెకండ్ల వ్యవధిలోనే కాక్‌పిట్‌లోని రెండు ఇంజిన్లకు ఉన్నట్లుండి ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీనితోనే విమానం ఎగిరి న కొద్ది క్షణాలలోనే సమీపంలోని బిల్డింగ్‌పై కు ప్పకూలింది. విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఎఎఐబి) దుర్ఘటన తరువాత నెలరోజులకు శనివారం వెలువరించిన ప్రాధమిక నివేదికలో ఈ విషయం వెల్లడించారు. ముందు ప్రకటించినట్లుగానే నివేదికను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. విమానం వేగం ఎత్తు అందుకోవల్సిన దశలో ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవ డం దుర్ఘటనకు దారితీసిందని ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో తేలింది. 15 పేజీల నివేదికలో ఈ విషయం స్పష్టం చేశారు. అప్పటి విమాన ప్ర మాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికులు, బయట
19మంది సజీవ దహనం చెందారు. ఒకే ఒక్క వ్యక్తి బతికి బయటపడ్డాడు. భారతీయ విమానయాన రంగంలో ఇది అత్యంత పెను విషాదకర ఘటనగా నిలిచింది. విమానంలోని బ్లాక్‌బాక్స్, వాయిస్ రికార్డర్‌లోని సమాచారం ఆధారంగానే దర్యాప్తు సంస్థ కొంత మేరకు ప్రమాద కారణాలను వెలికితీయగల్గింది. ఇక ఇంజిన్లలో ఒక్క సెకండు తే డాతో ఇంధన సరఫరా రాలేదు. దీనితో కాక్‌పిట్‌లో గందరగోళం చెలరేగింది. అప్పటికే విమానం కొద్ది దూరం వెళ్లింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్ పరికరం (సివిఆర్) లో రికార్డయిన మేరకు చూస్తే ఇంధన సమస్య తలెత్తగానే ఒక పైలట్ మరో పైలట్‌తో ఇంధనం ఎందుకు నిలిపివేశావు? అని అడిగాడు. దీనికి మరో పైలట్ తానేమీ చేయలేదన్నాడు. దీని తరువాత కాక్‌పిట్ సంభాషణ ఏదీ లే కుండా పోయింది. అప్పటికే విమాన పతనం జరిగింది. లం డన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం వెనువెంటనే అదుపుతప్పి పక్కన ఉన్న మెడికల్ కాలేజీ పై కూలింది. కొంత భాగం బిల్డింగ్‌లోకి దూసుకువెళ్లింది.
ఫ్యూయల్ కంట్రోలు స్విచ్ఛ్‌లు కటాఫ్
విమానం ఎగిరిన తరువాత దశలో ఇంజన్ల ఇంధన కం ట్రోలు స్విచ్చ్‌లు స్విచ్ఛాఫ్ స్థితిలో అంటే మూసివేసి ఉన్న ట్లు వెల్లడైంది. సాధారణంగా ఈ కంట్రోల్ స్విచ్ఛ్‌లతోనే ఇంధన సరఫరా నియంత్రణ జరుగుతుంది. ఇవి ఆన్ చేసి ఉంటేనే ఇంధనం ఇంజిన్లలోకి వెళ్లుతుంది. అయితే ఇవి స్విచ్ఛ్ ఆప్ అయి ఉన్నట్లు తేటతెల్లం అయింది. అయితే ఎందకిలా జరిగిందనేది నివేదికలో తెలియచేయలేదు. ఈ స్విచ్ఛాప్ విషయం ఇప్పుడు దర్యాప్తు సంస్థ ముందున్న కీలక విషయం అయింది. సాధారణంగా ఇం జిన్ల ఇంధన స్విచ్ఛాఫ్‌ల పనితీరును రన్ లేదా కటాప్ సూచిక ద్వారా తెలుసుకుంటారు.
ఇంధన సరఫరా లేకపోవడంతో వెంటనే ర్యాట్ పంప్ ద్వారా హైడ్రాలిక్ పవర్ పంపించేందుకు యత్నించినట్లు గుర్తించారు. అయితే అప్పటికే రెండు ఇంజిన్లు దాదాపుగా కనీస నిశ్చల స్థా యిలో మొరాయించుకుని ఉన్నాయి. పది సెకండ్ల తరువాత ఇంజిన్ 1లోని కటాఫ్ స్విచ్ఛ్ రన్ స్థాయికి చేరింది. కొద్ది సెకండ్ల తరువాత రెండో ఇంజిన్ గాడిలోకి రాలేకపోయింది. ఈ ఇంజిన్ సకాలంలో ఇంధనం అందుకోలేకపోయింది. ఈ లోగానే విమానం కుప్పకూలిందని ప్రాధమిక దర్యాప్తు క్రమంలో తేల్చారు. పైలట్లు అత్యయిక స్థితిని తెలిపే మేడే మేడే సూచిక వెలువరించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ స్పందించేలోగానే ఒకే ఇంజిన్‌తో సాగిన విమానం కుప్పకూలిందని వెల్లడైంది. విమాన దుర్ఘటన దశలో ప్రధాన పైలట్ విమానం పర్యవేక్షణలో ఉన్నాడు, కాగా కో పైలట్ విమానం నడిపించే సీట్లో ఉన్నట్లు వెల్లడైంది.
టేకాఫ్.. క్రాష్ మధ్య వ్యవధి కేవలం 30 సెకండ్లు
విమానం రన్‌వే నుంచి బయలుదేరడానికి, కూలిపోవడానికి మధ్య వ్యత్యాసం కేవలం 30సెకండ్లే. పైలట్లదే బాధ్య త అని చెప్పలేమని, వారు శిక్షకు అర్హులని కానీ తాము సిఫార్సు చేయడంలేదని దర్యాప్తు సంస్థ తెలిపింది. అయి తే కాక్‌పిట్‌లో గందరగోళం జరిగి ఉంటుందనే పరోక్ష సంకేతాలు వెలువరించారు. విమానం ఎగిరినదశలో స్పీ డ్ 180నాట్స్ ఐఎఎస్‌గా రికార్డు అయి ఉంది. తరువాత ఇంజిన్ల ఇంధన సరఫరా నిలిచిపోయిందని నివేదికలో తెలిపారు. మొత్తం మీద ఇంజిన్లకు ఇంధన శూన్యత పరిస్థితి వల్లనే విమాన పతనం జరిగినట్లు సంకేతాలు వెలువరించారు. విమానం కూలిన తరువాతి దశలో రెండు ఫ్యూయల్ స్విచ్ఛ్‌లు రన్ స్థితిలో ఉన్నాయని గుర్తించారు. అప్పటికే విమానం కూలి ఉంటుందని వెల్లడైంది. విమాన ప్రధాన పైలట్ సుమిత్ శభర్వాల్ 56 సంవత్సరాలు. ఆయనకు ఎయిరిండియాలో 30 సంవత్సరాల అనుభ వం ఉంది. 15638 ఫ్లైయింగ్ అవర్స్ రికార్డు స్థాపించా రు. ఇక కో పైలట్ క్లైవ్ కుందర్ 32. 3403 గంటల విమాన ఛోదక అనుభవం ఉంది. ఇది ప్రాధమిక దర్యాప్తు అని, పలు దశల దర్యాప్తు తరువాత పూర్తి స్థాయి నివేదిక ఉంటుందని దర్యాప్తు సాధికారిక సంస్థ తెలిపింది.
పైలట్ల సంఘం నిరసన
ఎఎఐబి ప్రాధమిక నివేదిక పట్ల ఎయిర్‌లైన్స్ పైలట్ల సం ఘం నిరసన వ్యక్తం చేసింది. పైలట్లదే తప్పు అనే రీతిలో ఈ నివేదిక ఉందని ఇది సమ్మతం కాదని ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అల్ఫా) తరఫున ప్రకటన వెలువడింది. పైలట్ల తప్పిదం ఉందనేది చెప్పకనే చెప్పినట్లుగా ఈ నివేదిక ఉందని విమర్శించారు. ఈ నివేదికను తాము తిరస్కరిస్తామని, వాస్తవికత ప్రాతిపదికన నిజాయితీతో కూడిన దర్యాప్తు అవసరం అని తేల్చిచెప్పా రు. ఇక ఇప్పటి నివేదికను ఎవరో కావాలనే ఎటువంటి అధికారిక సంతకం లేకుండా వెలుగులోకి తీసుకువచ్చారని సంఘం అధ్యక్షులు సామ్ థామస్ విమర్శించారు. ఇది ఎవరు వెలువరించారనే విషయం తెలియచేయలేదు. పైగా దర్యాప్తు అంతా గుట్టు చప్పుడు కాకుండా తమ స్థాయిల్లోనే అధికారులు నిర్వహించిన తంతుగా జరిగింది.
పైలట్ల సంఘాల వారికి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. పైగా ప్రాధమిక దర్యాప్తు క్రమం లో తేలిన విషయాలను తమకు ముందుగా సూచనప్రాయంగా తెలియచేయలేదు. ఇదంతా కూడా తమ మృతులైన పైలట్లదే బాధ్యత అంతా అని తేల్చే రీతిలో సాగిందని తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు. తమ విశ్వసనీయత పోవడంతో పాటు దర్యాప్తు సంస్థ పట్ల కూడా అనుమానాలు తలెత్తుతాయని వివరించారు. దర్యాప్తు బృందం లో అనుభవజ్ఞులైన పైలట్లు లేదా నిపుణులు , అర్హులను చేర్చలేదని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో కటాఫ్, రన్ స్విచ్ఛ్‌లు యాంత్రిక లోపంతో కూడా ఏర్పడుతాయనే విషయంపై దర్యాప్తులో ప్రస్తావించలేదని సంఘం తెలిపింది.