Monday, July 14, 2025

కోట శ్రీనివాసరావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కోట తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖు సంతాపం ప్రకటించారు.  కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు 1942, జులై 10న జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.

750కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 9 నంది అవార్డులు అందుకొని గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. 2015లో కోటకు పద్మశ్రీ పురష్కారం దక్కింది. ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేశారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా సేవలందించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News