మన తెలంగాణ/మోత్కూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో బిసిలకు 42%స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మంత్రుల, ఎంపి, స్థానిక శాసన సభ్యులు మందుల సామేలు ఫోటోలకు పాలాభిషేకం చేసి బాణాసంచ కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనేముంతల విమల వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి మందుల సురేష్, పురుగుల నర్సింహా యాదవ్, అవిశెట్టి అవిలిమల్లు, రాచకొండ బాలరాజు, గుండు శ్రీను, పల్లపు సమ్మయ్య, అన్నేపూ నర్సింహ, సుంకిషల అనిల్, పాలోజు శేఖర చారి, బందేల రవి, ముద్దం జయశ్రీ, అన్నెపూ పద్మ, తదితరులు పాల్ొన్నారు