రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తున్న రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. (Kothapallilo okappudu) కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-, చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ “ప్రవీణ పరుచూరి… సినిమాల్లో నటించాలంటే నటిస్తే సరిపోదు జీవించాలని (Pretending enough live) అన్నారు. అలా రామకృష్ణ క్యారెక్టర్ కి నేను ప్రాణం పోశాను. అందరూ ఈ సినిమాని ఆస్వాదిస్తారని భావిస్తున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ “సినిమా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు చాలా హాయిగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్‌లో నా స్టైల్‌లో కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా ఆలోచన కలిగించేలా ఉంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, రవీంద్ర విజయ్, ఫణి పాల్గొన్నారు.