పాట్నా: పోలీస్ స్టేషన్‌కు కొద్ది దూరంలో పట్టపగలే ఓ న్యాయవాదిని దుండగులు విచక్షితరహితంగా కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సంఘటన పాట్నాలోని సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో జరిగింది. సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో ఆదివారం పట్టపగలు న్యాయవాదిపై దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన న్యాయవాదిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా.. గత రెండు సంవత్సరాలుగా అతను ప్రాక్టీస్ చేయడం లేదని తెలుస్తోంది.
పాట్నా తూర్పు పోలీసు సూపరింటెండెంట్ (SP) పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ ఎప్పుడూ వెళ్లే టీ స్టాల్ కు వెళ్లి టీ తాగి తిరిగి వస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. అతన్ని చికిత్స కోసం PMCH ఆసుపత్రికి తరలించారు.. కానీ తీవ్ర గాయాలతో మరణించారు. సంఘటనా స్థలం నుండి మూడు ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అని చెప్పారు. సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ అధికారులు, పాట్నా సిటీ సబ్-డివిజనల్ ఆఫీసర్ అతులేష్ ఝా, ఎస్పీ పరిచయ్ కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనాస్థలంలో ఉన్న సిసిటివి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులను కూడా పిలిపించి ఆధారాలు సేకరించారు. జితేంద్ర కుమార్ క్రమం తప్పకుండా ఆ టీ స్టాల్‌కు వెళ్తాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.