- Advertisement -
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు ప్రధాన రహదారిపై ఆదివారం ఓ బెంజ్ కారులో మంటలు చెలరేగాయి. సిఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 11 గంటల సమీపంలో శ్రీకాంత్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి వోల్వో డీజిల్ కారులో ఎయిర్పోర్టుకు వెళ్తున్న క్రమంలో సిఐఎస్ఎఫ్ చెకపోస్టు సమీపానికి రాగానే కారులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నడుపుతున్న ఆయన కిందకి దిగడంతో రెప్పపాటు కాలంలోనే మంటలు భారీగా కారుకు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న శంషాబాద్ అవుట్ పోస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -