Monday, July 14, 2025

అటవీ అధికారుల వేధింపులతో వేగలేకపోతున్నాం

- Advertisement -
- Advertisement -

ఏళ్ల తరబడి భూములు సాగు చేస్తున్న తమను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం పరిధి.. నెన్నెల మండలానికి చెందిన కొందరు రైతులు బెల్లంపల్లి ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఈ కార్యాలయానికి వచ్చిన కొందరు రైతులు తమను ఫారెస్టు అధికారులు సాగు చేసుకోనివ్వడం లేదంటూ ఆరోపణలు చేస్తూ క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఒక రైతు తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..తమ భూములనే సాగు చేసుకోనివ్వకుండా

ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని, అంతేకాకుండా కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను ఫారెస్టు శాఖ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రైతు పెట్రోలు ఒంటిపై పోసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే అడ్డుకొని రైతులను క్యాంపు కార్యాలయంలో ఎంఎల్‌ఎ వినోద్ వద్దకు తీసుకొని వెళ్లారు. ఎంఎల్‌ఎ రైతుల సమస్యలు తెలుసుకొని ఫారెస్టు శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News