తుంగతుర్తి బహిరంగ సభలో
కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న
సిఎం రేవంత్రెడ్డి కొత్తగా 3,58,187
రేషన్ కార్డులు జారీ ప్రభుత్వంపై
నెలకు రూ.95.89 కోట్ల
అదనపు భారం
మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు ఆహార భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులను నిరంతరం అం దించే ప్రక్రియ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డుల మం జూరుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగే బహిరంగ సభలో శ్రీకారం చుట్టనున్నారు. పౌర సరఫరాల మంత్రి ఉత్త మ్ కుమార్రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,58,187 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో అదనంగా 15,53,074 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనున్నది. మొదటి దశలో సిఎం రేవంత్ రెడ్డి 2,03,156 కొత్త కార్డులు మంజూరు కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. తుంగతుర్తి సభలో కొత్త రేషన్ కార్డుల జారీతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89,95,282 నుంచి 95,56,625 కు చేరుకుంటుంది. లబ్ధిదారుల సంఖ్య 2,81,47,565 మంది నుంచి 3,09,30,911 మంది వరకు పెరుగుతుంది