- Advertisement -
వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. ఈశాన్య బంగాళా ఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
- Advertisement -