Thursday, July 17, 2025

సిపిఐ పాల్వంచ పట్టణ నూతన కమిటి ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పాల్వంచ టౌన్: సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సిపిఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబ అన్నారు. స్థానిక లారీ అసోసియేష్ హాల్‌లో శనివారం ఆ పార్టీ పట్టణ 19వ, మహాసభ జరిగింది. ఈ సంధర్భంగా వివిధ సమస్యలపై చర్చించారు. పలు డిమాండ్‌ల సాధన కోసం తీర్మానాలు చేశారు. అనంతరం పాల్వంచ పట్టణ నూతన శాఖ కార్యదర్శిగా అడుసుమిల్లి సాయిబాబా, సహాయ కార్యదర్శిగా ఉప్పుశెట్టి రాహుల్‌లతో పాటుగా 21 మందితో కార్యవర్గం, 91 మందితో కౌన్సిల్ సబ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News