Monday, July 14, 2025

పేదల సొంతింటి కల సాకారం…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జనగామ ప్రతినిధి: కాంగ్రెస్ పాలనలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు అన్నారు. ఆదివారం జనగామ మండలం శామీర్‌పేట, జనగామ పట్టణం 6వ వార్డులో మంజూరు ఇందిరమ్మ ఇళ్లకు వారు కొబ్బరికొట్టి ముగ్గుపోశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు తోట సిద్ధులు, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మాజీ మునిసిపల్ కౌన్సిలర్ వంగాల కల్యాణి, శామీర్‌పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాడగొండ కృష్ణారెడ్డి, 6వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు ఉపేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాండ్ర కౌసల్య, బాల్నె సుధాకర్, కడకంచి లక్ష్మీ వీరమల్లు, కాంగ్రెస్ నాయకులు ముజ్జు, పత్తి నరేందర్, తాండ్ర ప్రవీణ్, అజర్, శేఖర్, పాషా, రాజు, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News