Monday, July 14, 2025

పైచేయి కోసం..పరుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: స్థాని క సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగు లు వేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వు లు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలును మరింత వేగవంతం చేసింది. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ ముం దుకెళుతున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. మహిళలకు ఉచితంగా బ స్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల కే టాయింపులు, అర కోటికి పైగా పేదల ఇండ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న బి య్యం పంపిణీ, సన్న బియ్యం పండించే రైతులకు స బ్సిడీ, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలెండ ర్ వంటి పథకాలే ప్రచార అస్త్రాలుగా పార్టీ భావిస్తోంది. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజా స్పందన ఎలా ఉందన్న అంశంపై ప్రభుత్వం, పిసిసి వేర్వేరుగా సర్వే చేయించినట్లు సమాచారం. రైతు భరోసా, వః్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ప్రతి ఊరికి బస్సు సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందుల పంపిణీ, సర్కారు బడులకు మరమ్మత్తులు, రోడ్లు మెరుగుపరచడం వంటి వాటితో ప్రజలు సంతోషంగా ఉన్నారని నివేదికలు అందాయి.

సన్న బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడం ద్వారా తెలుపు రంగు రేషన్ కార్డుదారులు సంతోషంగా ఉన్నారని, ఆ బియ్యాన్ని తామే వాడుకుంటున్నామని ఇతరులకు విక్రయించడం లేదని వినియోగదారులు చెప్పినట్లు నివేదిక ద్వారా తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండడం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారని, మహిళల ఓట్లే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కీలకం అవుతాయని ముఖ్యమంత్రి, మంత్రుల అంఛనా. గెలుపు బాధ్యతను పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులపై, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా నియమితులైన పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులపై పెట్టింది. పిసిసి నిర్వహించిన సర్వేలో కూడా ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని, అయితే పార్టీలో పాత, కొత్త నాయకులను కలుపుకుని పోయేలా సమన్వయపరచాల్సి ఉన్నట్లు నివేదిక వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

అధికారంలో చేపట్టాక ..
స్థానిక సంస్ధల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అధికారం చేపట్టిన తర్వాత తొలి ఎన్నిక. పెద్ద మొత్తంలో పథకాలను అమలు చేస్తున్నందున ప్రజలు తమ వైపే ఉన్నారన్న భరోసా ఉన్నప్పటికీ, పలు జిలాల్లో పార్టీలో గ్రామ, మండల స్థాయి నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నదన్న ఫిర్యాదులు నాయకత్వానికి అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదరడం లేదన్న అభిప్రాయంతో ఉంది. కాంగ్రెస్‌లో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతూ ఉన్న నాయకులు, కార్యకర్తలకు, బిఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కుదరడం లేదన్న ఫిర్యాదులు పార్టీ నాయకత్వానికి వస్తున్నాయి. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యత కూడా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు నాయకత్వం అప్పగించడం జరిగింది.

కదిలిన యంత్రాంగం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలను మట్టికరిపించాలన్నది కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నది. ఈ ఎన్నికల్లో 99 శాతం సీట్లు కైవసం చేసుకుంటే ఏడాదిన్నర తమ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టమైందని బలంగా చెప్పుకోవడానికి అవకాశంగా ఉంటుందని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆస్కారం ఉండదని నేతల భావన. పార్టీ నూతన కార్యవర్గంలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటించడం, పాత, కొత్త నాయకులకు పదవులు కల్పించడం, బిసిలకు, మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది,.

ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఖర్గే అభినందిస్తూ, ఇంత పెద్ద ఎత్తున మరే ఇతర రాష్ట్రంలోనూ పథకాలు అమ లులో లేవన్నారు. కాబట్టి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతల మధ్య సమన్వయం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి జూమ్ మీటింగ్‌లలో పాల్గొంటూ, నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.

జెడ్‌పి చైర్మన్‌లపై ఫోకస్
గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్నదే కాంగ్రెస్ నాయకత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే చైర్మన్ పదవులు దక్కిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని స్థానాల్లోనూ విజయఢంకా మోగించాల్సిందేనన్న భావనతో ఆ పార్టీ ఉంది.
తేలనున్న రిజర్వేషన్ల అంశం
బిసిల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పనున్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బిసిల రిజర్వేషన్లను తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

విపక్షాలకూ పరీక్షే..
స్థానిక సంస్థల ఎన్నికలను విపక్షాలూ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపికి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ పాలనతో ప్రజలు బేజారెత్తారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు ఎంత వరకు విశ్వసించారన్నది కూడా తేలిపోనున్నది. ఈ ఫలితాలు ఆయా పార్టీల మనుగడకు సంబంధించిన అంశమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బిజెపికి నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఇటీవల నియమితులయ్యారు. ఆయన ఇంకా కార్యవర్గం కూర్పులో తలమునకలై ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని కదనరంగంలోకి దూకాల్సి ఉంది. మరోవైపు బిఆర్‌ఎస్ అధినేత,

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకూ ఈ ఎన్నికలు సవాల్‌గా పరిణమించాయి. ఈ ఎన్నికల్లో కొన్ని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లనైనా సాధించగలిగితేనే ప్రధాన ప్రతిపక్షం బలపడుతున్నదన్న సంకేతాలు వెళతాయి. స్థానిక సమరానికి తాము సిద్ధంగా ఉన్నామని బిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు బిసి రిజర్వేషన్లపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై వత్తిడి తెచ్చి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సమరానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఫలితాలతో వెంటనే ప్రభుత్వ మనుగడకు వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా పార్టీల పట్ల ప్రజాధరణ ఎలా ఉందో స్పష్టమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News