న్యూఢిల్లీ: ఉప్పు వాడకం తగ్గించాలని, లేకపో తే ఆరోగ్యానికి ముప్పు అని డబ్లుహెచ్‌ఒ భా రతీయులను హెచ్చరిస్తోంది. అయితే దీనిని గు ర్తించకుండా, గుర్తించినా పట్టించుకోకుండా స గటు భారతీయులు ఉప్పు మోతాదు మించి తీ సుకుంటున్నారు. ఎక్కువగా రోజువారి ఆహార దైనందిన అలవాట్లలో భాగంగా ఉప్పు మోతా దు ఎక్కువ ఉంటేనే రుచి అని భారతీయులు భావిస్తున్నారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 5 గ్రాము ల కన్నా తక్కువ ఉప్పు తీసుకుంటే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) కొలమానాన్ని భారతీయులకు వెలువరించింది. అ యితే సగటు భారతీయుడు రోజుకు 8 గ్రాము లు మించి తీసుకుంటున్నాడు. పైగా గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇది 5.6 గ్రామలు వరకూ ఉంటోందని అధ్యయనంలో వెల్లడైంది. నగర పట్టణ ప్రాంతాలలో దాదాపు 9.2గ్రాముల వరకూ ఉంటోంది. దీని వల్ల అధిక రక్తపోటు రక్తనాళాల సమస్యలు, గుండెపోట్లు వంటివి తలెత్తుతున్నాయని వెల్లడైంది.
భారతీయులలో ఈ లవణం వాడకం గురించి భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసిఎంఆర్) సమగ్ర సర్వేనే నిర్వహించింది ఈ క్రమంలో ఉప్పు తో తలెత్తుతున్న ముప్పు గురించి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పు ఎక్కువతో తలెత్తే అనారోగ్య సమస్యలు చివరికి మరణాలకు దారితీస్తున్నాయి, పలు రకాలుగా మనుష్యులను బలహీనపరుస్తున్నాయని పసికట్టారు. అయితే భారత్‌లో ఉప్పు వాడకం ప్రాంతాలు జనాన్ని బట్టి మారుతోంది. మగవారు, గ్రామీణ జనం, స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నారు. భారతీయ వంటకాలలో ఉప్పు కారం ప్రధాన దినుసు అవుతోంది. ఆహారం మసాలాయుతంగా ఘాటుగా ఉండాలనే జిహ్వచాపల్యం, భారతీయ వాతావరణంలోని ఆకలిని పెంచే లక్షణం ఉప్పు అధిక మోతాదు వాడకానికి దారితీస్తోంది. ఉప్పుతో పెరిగే సోడియం స్థాయిలు ప్రాణాంతకం అవుతున్నాయి. ఎక్కువగా ప్యాకెటు ఫుడ్స్ గిరాకీ పెరిగేందుకు రుచికరపు వంటకాలకు దిగుతున్నారు. సాధారణంగా వైద్యులు, ఆరోగ్య నిపుణులు తరచూ తక్కువ సోడియం తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు.
సోడియం తక్కువ శాతం తీసుకునేలా చేసేందుకు నిపుణులు ఓ మార్గం కనుగొన్నారు. ఉప్పు సంబంధిత సోడియం లేకుండా పొటాసియం లేదా మగ్నీషియం మూలకాల ఉప్పు వాడకానికి ప్రోత్సహిస్తున్నారు. సంబంధిత లవణాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అనారోగ్య సమస్యల నివారణ సంస్థ (ఎన్‌ఐఇ) సీనియర్ సైంటిస్టు, ఉప్పు వాడకం ప్రధాన అధ్యయనకర్త శరన్ మురళి తెలిపారు. ఉప్పు తగ్గిస్తూ పోతూ ఉంటే అది బిపిని నియంత్రిస్తుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయని డాక్టర్ మురళీ సూచించారు. ఉప్పువాడకం తగ్గింపు చర్యలపై ఈ సంస్థ ముందుగా తెలంగాణ, పంజాబ్‌లలో ఐసిఎంఆర్ సాయంతో ఉప్పు తగ్గింపు కోసం మూడు సంవత్సరాల చైతన్య ఉద్యమం చేపట్టింది. అయితే మార్కెట్‌లో ఉప్పు పలు రకాలుగా పలు పేర్లతో అందుబాటులోకి వస్తోంది. కానీ శాస్త్రీయ రీతిలో ఉప్పు వాడకానికి బదులుగా దొరకాల్సిన ఉత్పత్తులు అందుబాటులోకి రావడం లేదని వెల్లడైంది. దీనితోనే మనిషి ఇప్పుడు దొరికే ఉప్పుతో జీవితం సాగిస్తున్నాడని తేల్చారు.