Friday, August 29, 2025

ఒక్కతాటిపైకి ఓరుగల్లు నేతలు?

- Advertisement -
- Advertisement -

గాంధీ భవన్‌లో ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో
మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఎల సమావేశం

సమావేశంలో మంత్రి కొండా, ఎమ్మెల్యే కడియం
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: ‘కలిసి సాగుదాం…స్థానిక సంస్థల ఎన్నికల్లో విజ యం సాది ద్ధాం..’ అని వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశంలో వైరి పక్షాలైన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రభృతులు ఉన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. మంత్రి కొండా దంపతులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, తదనంతరం ఆ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడమే కాకుండా వెంటనే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

ఈ మేరకు పార్టీ ఇన్‌ఛార్జ్ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్న మంతి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఒకే దగ్గర కూర్చొవడం ఆసక్తి రేకిత్తించింది. అయితే పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే చర్చించడం, అందరూ కలిసి ముం దుకు సాగాలని మంత్రి లక్ష్మణ్ వారికి సూచించగా, వారంతా సానుకూలంగా స్పందించారు. ఇదిలాఉండ గా సమావేశానంతరం మంత్రి కొండా సురేఖ తనను కలిసిన విలేఖరులతోఈ సమావేశం పూర్తిగా పార్టీ నిర్మాణానికి సంబంధించిందేనని చెప్పారు. పార్టీలో పరస్పర ఆరోపణలు చేసుకున్నప్పటికీ, ఆ సంగతి క్రమశిక్షణా కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మన తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ తాను మొదటి నుంచి ఎవరి జోలికి వెళ్ళనని చెప్పారు. అనవసరంగా ఎవరైనా తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తే సహించనని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పటిష్టత, సంస్థాగత నిర్మాణంపై చర్చించామని, ఇతర విషయాలేవీ చర్చకు రాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News