న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ (Indian Boxing) సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం సన్నహాలు చేస్తుంది. కార్యవర్గం పదవీ కాలం ముగిసి 5 నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఐఒఎ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఐఒఎ అధ్యక్షురాలు పిటి ఉష కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్షన్స్ కోసం ఆదివారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కార్యనిర్వాహక మండలిలో ఉన్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ముగిసింది. అయినా ఇప్పటి వరకూ కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు మాత్రం జరుగలేదు.
దాంతో, దేశంలో బాక్సింగ్ పోటీల నిర్వహణ,(Management competitions) బిఎఫ్ఐ పనితీరుపై ప్రభావం పడుతోందని, అందుకే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిస్కారం దొరుకుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ కమిటీలో కోశాధికారి సహదేవ్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులలో ఒకరైన భూపేందర్ సింగ్ భజ్వా, న్యాయవాదిపాయల్ కక్రాలు సభ్యులు. డబ్ల్యూ ఎఫ్ఐ ఎన్నికలు నిర్వహణ గురించి, కమిటీ సమయం ముగిసిన వెంటనే ప్రక్రియను చేపట్టడంపై సూచనలు చేయనుంది.