Monday, July 14, 2025

రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభగంగా జరుగుతున్నాయి. బోనాల జాతర సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణిని వినిపించడం ఆనవాయితిగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం కూడా ప్రధాన ఘట్టమైన రంగం భవిష్యవాణిని ఆమె వినిపించారు. “ప్రతి ఏటా చెబుతూనే ఉన్నా.. ఏదో ఒక ఆటంకం చేస్తున్నారు. నా మాటలు వినడం లేదు.. ఏం చేయడం లేదు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది.. అగ్నిప్రమాదాలు జరుగుతాయి. మీరు జాగ్రత్తగా అన్నీ పాటించండి. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి” అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం భవిష్యవాణి వినేందుకు  ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ భవిష్యవాణి కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News