- Advertisement -
ప్రముఖ సీనియర్ నటి సరోజాదేవి(87) కన్నుమూశారు. బెంగళూరు మల్లేశ్వరంలోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. సరోజాదేవి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం సినిమాల్లో నటించిన సరోజాదేవి.. తన కెరీర్ లో 200కు పైగా చిత్రాల్ల పలు రకాల పాత్రలు పోషించారు. ఇక తెలుగులో సీనియర్ అగ్ర నటులు.. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి ఆమె నటించారు. ఇంటికి దీపం ఇల్లాలు, దాగుడు మూతలు, మంచి చెడు వంటి హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. తమిళ్ లో ఎంజీఆర్ సినిమాల్లో నటించారు. ఇలా దక్షిణాది అన్ని భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 13 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరోజాదేవి.. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
- Advertisement -