హైదరాబాద్: స్మార్ట్ సిటీలు, హై-స్పీడ్ రైలు నుండి డిజిటల్ నీటి వ్యవస్థలు మరియు స్థిరత్వంతో కూడిన ఇంధన నెట్‌వర్క్‌ల వరకు మౌలిక సదుపాయాల పరంగా పరివర్తన దశలో భారతదేశం ఉంది. హైదరాబాద్‌లో జూలై 17న, దిలీలాహోటల్‌లో, ఇన్నోవేషన్ డేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన బెంట్లీ సిస్టమ్స్ నిర్వహించనుంది. భారతదేశం యొక్క మౌలిక సదుపాయాల రంగాలలో అర్థవంతమైన పురోగతిని నడిపిస్తున్న డిజిటల్ ట్విన్స్ మరియు జియోటెక్నికల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అన్వేషించడానికి ప్రభుత్వం, పరిశ్రమ మరియు సాంకేతిక నాయకులను ఒకచోట చేర్చనుంది.
పరిశ్రమ నాయకుల నుండి పరిజ్ఞానంతో కూడిన చర్చలు, డిజిటల్ ట్విన్ అప్లికేషన్‌ల ప్రత్యక్ష ప్రదర్శనలు, డిజిటల్ డెలివరీ, డిజిటల్ ట్విన్స్ , జియోటెక్నికల్ ఇంజనీరింగ్ సొల్యూషన్‌లు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా రూపొందించాయి, నిర్మించాయి, నిర్వహిస్తున్నాయి అనే దానిపై ఆకట్టుకునే సెషన్‌లను ఈ కార్యక్రమంతో ఆశించవచ్చు.
ఈ సంవత్సరం కార్యక్రమం, రవాణా, నీటి మౌలిక సదుపాయాల కోసం భారతదేశపు దృక్పథాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ రంగాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి డిజిటల్ ట్విన్స్ పాత్ర, భవిష్యత్ డెలివరీ అవసరాలకు ప్రాజెక్ట్ జీవితకాలాన్ని ఎలా మెరుగుపరచాలన్న దానిపై చర్చలు కేంద్రీకృతమై ఉంటాయి. ఈ కార్యక్రమం నెట్‌వర్కింగ్ హబ్‌గా కూడా పనిచేస్తుంది. భాగస్వామ్యం చేసుకోవటానికి, ఆలోచనలను పంచుకోవడానికి, మౌలిక సదుపాయాల భవిష్యత్తును రూపొందించడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమ నిపుణులను ఒకచోట చేర్చుతుంది. బెంట్లీ ఇన్నోవేషన్ డే లో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన వ్యక్తులు బెంట్లీ ఇన్నోవేషన్ డే హైదరాబాద్ 2025 వద్ద నమోదు చేసుకోవచ్చు.