Monday, July 14, 2025

మొదటి సెషన్‌లోనే గెలుస్తాం.. ఇంగ్లాండ్ కోచ్ కు సుందర్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

లార్డ్స్‌ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మద్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.  రెండు జట్లకు విజయావకాశాలు ఉండటంతో ఐదో రోజు ఆటపై అభిమానుల్లో అసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే.. భారత్ 135 పరుగులు, ఇంగ్లాండ్ కు 6 వికెట్లు కావాలి. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట అనంతరం ఇంగ్లాండ్ కోచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఐదో రోజు ఆటలో గంటలోపే 6 వికెట్లు తీసి భారత్ ను ఆలౌట్ చేస్తామని పేర్కొన్నాడు. చివరి రోజు మొదటి సెషన్ లోనే ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తామని భారత ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్ కోచ్ కు కౌంటర్ ఇచ్చాడు. ఐదవ రోజు 193 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తుందనే నమ్మకం ఉందని సుందర్ అన్నాడు. మా బ్యాటింగ్ లైనప్ ఇంకా బలంగానే ఉందని.. ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తొలి సెషన్ లోనే మ్యాచ్ ను ముగిస్తామని.. కుదరకపోతే లంచ్ తర్వాత అయినా విజయం సాధిస్తామని సుందర్ పేర్కొన్నాడు.

కాగా, నాలుగో రోజు బంతితో చెలరేగిన సుందర్.. నాలుగు కీలక వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ పతనాన్ని శాసించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే కుప్పకూలింది.  తర్వాత 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కెఎల్ రాహుల్(33) ఉన్నాడు. అతనికి జోడీగా రిషబ్ పంత్ వచ్చే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఇరుజట్లు 387 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News