Monday, July 14, 2025

సినీ పరిశ్రమలో విషాదం.. షూటింగ్‌లో స్టంట్‌మ్యాన్ మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణలో స్టంట్ మ్యాన్ ఎస్ఎమ్ రాజు ప్రాణాలు కోల్పోయారు. పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటిస్తున్న ‘వెట్టువమ్’ సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) కారు స్టంట్ చేస్తున్న సమయంలో రాజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే రాజుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

రాజు మృతికి తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు నటులు సంతాపం తెలియజేశారు. ఆయనతో కలిసి పలు చిత్రాల్లో కలిసి పని చేసిన హీరో విశాల్.. రాజు మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాజు కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరో స్టంట్ మాస్టర్ సిల్వ కూడా రాజు మరణానికి సానుభూతి తెలియజేశారు. కారు జంపింగ్ స్టంట్స్ చేయడంలో రాజు తర్వాతే ఎవరైనా అని.. ఆయన మరణం స్టంట్ యూనియన్‌తో పాటు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News