- Advertisement -
బిసి బాలికల హాస్టల్ బిల్డింగ్ పై నుండి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యను ఆమె తల్లిదండ్రులు.. ఆదివారం తూప్రాన్‌పేటలోని జ్యోతిబాపూలే హాస్టల్‌లో చేర్పించారు. విద్యార్థినికి హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేకపోయిన సర్దిచెప్పి బలవంతంగా హాస్టల్ లో చేర్పించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో హాస్టల్ నాలుగో అంతస్తు నుండి దూకి సంధ్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంధ్య ఐదవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. సమాచార అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్లలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -