హైదరాబాద్: సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సాగర్ ఆయకట్టుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని అన్నారు. రాబోయే 5 రోజుల్లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు (Water ayacut) విడుదల చేస్తామని తెలియజేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు పథకాలు అమలు చేస్తున్నామని, రైతుభరోసా రైతులకు ఎకరాలకు రూ.12 వేలు అందించామని, రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. సన్న ధాన్యానికి క్వింటాళ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా బోనస్ ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
5 రోజుల్లో పూర్తిస్థాయి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల: పొంగులేటి
- Advertisement -
- Advertisement -
- Advertisement -