లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో లక్ష్య చేధనలో భారత్ తడబడుతోంది. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తోంది. అయితే మూడో టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) అంతగా రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.
అయితే శుభ్‌మాన్ (Shubman Gill) స్వల్పస్కోర్‌కే ఔట్ అయినా.. అరుదైన రికార్డున తన ఖాతాలో వేసుకున్నడు. ఈ సిరీస్‌లో ఓ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో గిల్ 101.17 సగటుతో 607 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌లో ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల క్రితం రాహుల్ ద్రవిడ్ (607) రికార్డును గిల్ అధిగమించాడు. దీంతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని (593) మూడో స్థానానికి వెనక్కి నెట్టేశాడు.
కాగా, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్, భారత్ 387 పరుగుల చేశాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌట్ కాగా, 193 పరుగుల లక్ష్య చేధనలో భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలి అంటే భారత్ మరో 135 పరుగులు చేయాలి. క్రీజ్‌లో కెఎల్ రాహుల్ (33) ఉన్నాడు.