Tuesday, July 15, 2025

ఇండోనేషియాలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం

- Advertisement -
- Advertisement -

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తూర్పు ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు US జియోలాజికల్ సర్వే ప్రకటించింది. అయితే, దీని వల్ల ఎటువంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. తూర్పు మలుకు ప్రావిన్స్‌లోని తువాల్‌కు పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపింది. చిన్న పట్టణాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో అనేక ఇండ్లు, రోడ్లు, పలు మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టారు. భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News