Tuesday, July 15, 2025

లార్డ్స్‌లో గెలిస్తే.. ఆ క్రెడిట్ మొత్తం అతనిదే: అనిల్ కుంబ్లే

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్స్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఉత్కంఠగా జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 387 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 58 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే భారత్‌కు విజయం అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) అన్నారు. ఒకవేళ అదే జరిగితే ఆ క్రెడిట్ మొత్తం బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌కి దక్కాలన్నారు.

‘‘లార్డ్స్ టెస్టులో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ ముఖ్యమైన వాడు. అతడి వికెట్ ఇవ్వకుండా ఉంటే చాలు ఇంగ్లండ్‌పై విజయం సాధించవచ్చు. ఐదో రోజు ఆటకి శుభారంభం అందించమే కాదు.. చివరి వరకూ ఉండాలి. జో రూట్‌ల ఆడుతున్న రాహుల్‌కు ఇది ఓ మంచి అవకాశం. క్రిస్ వోక్స్ క్యాచ్ మిస్ చేశాడు. అప్పటి నుంచి రాహుల్ ఇంకా జాగ్రత్తగా ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఇలాంటి ఆట తీరే కనబరిచాడు’’ అని కుంబ్లే (Anil Kumble) అన్నారు. క్లిష్టమైన పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్‌కే క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News