Tuesday, July 15, 2025

వరుసగా వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో టీం ఇండియా

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా (Team India) కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 193 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడుతోంది. ఐదో రోజు 58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 21వ ఓవర్ ఐదో బంతికి రిషబ్ పంత్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత స్టోక్స్ ఓవర్‌లో కెఎల్ రాహుల్ (39) ఎల్‌బిడ్ల్యూ కావడంతో భారత్‌కు పెద్ద దెబ్బ పడింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 29 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్.. మరో 98 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో జడేజా(12), నితీశ్ (3) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News