Tuesday, July 15, 2025

రైలు బోగీలో మంటలు.. పూర్తిగా కాలిపోయిన పెట్టే..

- Advertisement -
- Advertisement -

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. యార్డులో ఉన్న హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి బోగీ పూర్తిగా కాలిపోయింది. రాజస్థాన్‌లోని హిసార్ నుంచి వచ్చిన హిసార్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా తిరుపతికి చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లో దింపిన తర్వాత ట్రైను యార్డులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇంజిన్ వెనుకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ పక్కనే మరో ట్రైక్‌పై ఉన్న రాయలసీమ ఎక్స్‌‌ప్రెస్‌లోని జనరేటర్ బోగికి మంటలు వ్యాపించాయి.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Accident) ఘటనస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కానీ, ఆ లోపే హిస్సార్ ఎక్స్‌ప్రెస్ బోగీ పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోని జనరేటర్ బోగీ పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా ఇతర రైళ్లకు ఎలాంటి నష్టం జరగలేదన రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News