- Advertisement -
లండన్: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు (Ind VS Eng) విజయావకాశాలు దాదాపు దూరమయ్యాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 193 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందుంచింది. అయితే నాలుగో రోజే 4 వికెట్లు కోల్పోయిన భారత్.. ఐదో రోజు 24 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిల జోడీ.. జట్టును ఆదుకొనే ప్రయత్నం చేసింది. వీరిద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కి 30 పరుగులు జోడించారు. కానీ, వోక్స్ 40వ ఓవర్ మూడో బంతికి నితీశ్(13) స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్‌లో రవీంద్ర జడేజా(17) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. భారత్ ఇంకా 81 పరుగులు చేయాలి.
- Advertisement -