Tuesday, July 15, 2025

ఆరాంఘర్ వద్ద ఓ జంట బైక్ పై వికృత చేష్టలు

- Advertisement -
- Advertisement -

ప్రేమలో తేలి పోదామా..! జాతీయ రహదారి పై రైయ్యని పోదామా..! గాలిలో కలసి పోదామా అన్నట్లు మోటారు సైకిల్ పై ఓ జంట ప్రేమ మోత మోగించారు. జుగుస్సారమైన రీతిలో సభ్య సమాజానికి ఆ జంట ఏం సందేశం ఇవ్వాలనుకుందో తెలియదు. కానీ, ఆదివారం రాత్రి సమయంలో మోటర్ సైకిల్ పై ఒకరిని, ఒకరు పెనవేసుకుని మోటర్ సైకిల్ పై ప్రేమ విహార యాత్ర చేశారు. హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి పై ఆరాంఘర్ వద్ద వెలుగు చేసిన ఈసంఘటన ఇదేం పోయేకాలం అనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే… శంషాబాద్ వైపు నుంచి ఆరాంఘర్ వైపు జాతీయ రహదారి పై ఎపి10 ఎజడ్ 2501 మైక్ పై ఒక యువతి, యువకుడు వస్తున్నారు.

వారు సాధారణ బైక్ ప్రయాణం చేస్తే ఎవ్వరి ఇబ్బంది లేదు. కానీ, యువతి పెట్రోల్ ట్యాంక్ పై డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎదురుగా కూర్చుని అతని నడుము పై తన రెండు కాళ్లు వేసి కౌగిలించుకు కూర్చుంది. అంతటితో ఆగని ఆ జంట లవ్ బర్డ్ మాదిరి ముద్దుల్లో మునిగి తేలుతూ వాహనం పై వేగంగా వెళ్లారు. వెనుక వైపు నుంచి వచ్చిన ఓ కారులోని ప్రయాణికులు ఆ జంట వితం, వికృత చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జనంతోపాటు వాహన సంచారం ఉన్న ప్రదేశంలో బైక్ పై వెళుతున్నామన్న కనీస జ్ఞానం వారిలో కపించలేదు. అలా ఆ జంట వేగంగా దూసుకువెళుతుండడంతో అటుగా వస్తున్న వాహనదారులను కలవరానికి గురి చేసింది. ఎక్కడ వాళ్ల వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురవుతారోనని ఆ దృశ్యాలు సినిమా మాదిరి కళ్ళ ముందు వీక్షించిన పులువురు ఆందోళన చెందారు. కానీ, సదరు జంట మాత్రం ఆ రోడ్డు పై వెళుతున్నవారితో పాటు వాహనాలతో తమకేమి పట్టనట్లు మరింత విఫరీత దోరణి కొనసాగించారు.

ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా అలానే తమ బైక్ ప్రేమ యాత్ర కొనసాగిస్తు ముందుకు దూసుకువెళ్లారు.అయితే వారు ఎక్కడి వారు . ఎక్కడికి వెళ్లి తిరిగి ఎక్కడికి వెళుతున్నారన్నా విషయాలు ఇంకా తెలియరాలేదు. కానీ, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం రాత్రి 9 గంటల 45 నిముషాలకు మాత్రం సదరు పైక్ నంబర్ పై రూ.2435 చలాన మాత్రం విధించారు. ట్రాఫిర్ పోలీసులు విధించిన చలానలో మాత్రం ఆ బైక్ యజమానికి శ్రీనివాస్ రతన్‌గా ఉంది. సదరు వాహనం బజాజ్ సిటి100గా ఫోటో సూచిస్తోంది. బైక్ నంబర్ ఎపి10ఎజడ్2501 పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ల పరిధిలో వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ట్రాపిక్ నియమాలు పాటించకపోవడంతో 13 చలానలు విధించబడి ఉన్నాయి. 2024 మార్చి 5వ తేదీన మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానలో వాహన ముందు భాగం రూపురేఖలతో పోల్చితే మే 7వ తేదీ 2025 నాటికి మారిపోయి పోలీస్ చలాన వెబ్ సైట్‌లో కనిపించింది. ఇప్పటి వరకు ఎపి10 ఎజడ్ 2501 బజాజ్ సిటి100 బైక్ పై మొత్తం రూ.6220 చలాన విధించినట్లుగా తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటేడ్ ఈ చలాన వెబ్ సైట్‌లో ఉంది.

ఈ జంట లవ్ జిహాదీలా…? డ్రగ్స్ బానిసలా..?
జాతీయ రహదారి పై నిర్భయంగా పెనవేసుకుని , ప్రేమ పాటాలు వళ్లించుకున్న జంట లవ్ జిహాదీయా..? లేక డ్రగ్స్‌కు బానిసలుగా మారి మత్తు తలకెక్కడంతో తమ వికృత రూపం చూపారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజమైన ప్రేమికులైతే ఇలా భరి తెగించి బజారులో ఇష్టానుసారంగా వ్యవహరించరని తెలుస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా నిలిచే హైదరాబాద్ మహానగరంలో ఏమిటీ విఫరీత బుద్ది అనే పోలీసులు తేల్చాల్సి ఉంది. పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా వికృత చేష్టలతో బైక్ రైడ్‌కు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పలు యువజన సంఘాలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చేష్టలకు దిగాలంటే భయపడే విధంగా పోలీసు చర్యలు ఉండాలని కోరుకుంటున్నామని వారు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News