Tuesday, July 15, 2025

అస్తిపంజరం కలకలం

- Advertisement -
- Advertisement -

పదేళ్ల క్రితం అదృశ్యమైన
వ్యక్తి అస్థిపంజరంగా
అనుమానిస్తున్న పోలీసులు
ఇంట్లో పడిన బంతి కోసం
వెళ్లి అస్థిపంజారాన్ని
గుర్తించిన కుర్రాడు
దర్యాప్తు చేస్తున్న
హబీబ్‌నగర్ పోలీసులు

మనతెలంగాణ/నాంపల్లి:నాంపల్లి మార్కెట్ వద్ద ఓ ఇంట్లో ఓ అస్థి పంజరం కనిపించిం ది. ఇమ్రాన్ ఖాన్ (55) అనే వ్యక్తి ది కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సు మారు పదేళ్ల క్రితం ఆయన చనిపోయాడు. ఇన్నాళ్లకు అతని అస్థిపంజరం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఉదయం 11 గంటలకు అస్తిపంజరం ఉన్న విషయం స్థానికులకు తెలిసింది. అక్కడే ఉం టున్న పిల్లలు క్రికెట్ అడుతూ బంతి ఇమ్రా న్ ఖాన్ చనిపోయిన గదిలో పడింది. బం తిని వెతకడానికి వెళ్లిన మహమ్మద్ రయాన్ చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.వెంటనే తన సెల్ ఫోన్‌లో వీడియో తీసి ప్రసార మాధ్యంలో వైరల్ చేశాడు. దీం తో అస్థిపంజరం ఉన్న విషయం వెలుగులో కి వచ్చింది. ఈ విషయం తెలిసి హుటాహుటిన డీసీపీ చంద్రమోహన్, ఆసిఫ్‌నగర్ ఎసీ పీ కిషన్‌కుమార్,హబీబ్‌నగర్‌ఇన్‌స్పెక్టర్ పు రుషోత్తంరావు, ఎస్‌ఐ సందీప్ తదితరు లు అస్థిపంజరం ఉన్న ఇంటికి వెళ్లారు. హ బీబ్‌నగర్ పోలీసుల కథనం…2015 నుంచే ఇ మ్రాన్ ఖాన్ తన ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు.

తరుచూ అతని కుటుంబసభ్యులతో గొడవలకు దిగేవాడు. అతని మానసిక స్థ్థితి కూడా బాగోలేదు. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాదాపు పదేళ్లుగా అతడు కనిపించడం లేదు. హఠాత్తుగా సోమవారం అతను అస్తిపంజరమై కనిపించాడు. అస్తిపంజరాన్ని కదిలిస్తే ఆధారాలు చెడిపోతాయన్న ఉద్దేశంతో అక్కడే ఉంచామని హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం రావు తెలిపారు. పోలీసులు పలు కోణాల్లో తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి చెందిన నిఫుణులు అస్తిపంజరాన్ని పరిశీలించనున్నారు. అది ఎన్నాళ్ల నుంచి అక్కడ ఉన్నదో.. ఇన్నాళ్లు ఎందుకు స్థానికులకు,. కుటుంబసభ్యులకు తెలియలేదో వంటి అంశాల్లో నిర్ధారణ చేస్తారు.. సుమారు పదేళ్ల నుంచి ఇంట్లోనే అస్తిపంజరం ఉండడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిపంజరం గురించి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే హబీబ్‌నగర్ పోలీసులు విచారణకు దిగుతారు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే… అని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News