Wednesday, July 16, 2025

18న ఫస్ట్ సింగిల్

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka) లో రిఫ్రెషింగ్ అవతార్‌లో కనిపించనున్నాడు. ఇందులో అతను సినిమా అభిమానిగా అలరించనున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది. వివేక్,- మెర్విన్ ద్వయం స్వరపరిచిన మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ జూలై 18న విడుదలవుతుంది. ట్రాక్ కోసం ప్రమోషనల్ (Promotional track) పోస్టర్‌లో రామ్ ఉత్సాహంగా తెరచాపతో నాటు పడవపై ప్రయాణిస్తున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News