తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’.( Police vari hechcharika) ఈ చిత్ర తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని (audience love film)కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ “పోలీస్ వారి హెచ్చరిక చిత్రం ఇతర సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ల మధ్య మంచి సన్నివేశాలు ఉండబోతున్నాయి. వారి మధ్య ప్రేమ, పాటలు ఉండబోతున్నాయి. ఒక మంచి సందేశాన్ని ఈ చి త్రంతో ప్రేక్షకులకు తెలుపబోతున్నాము”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టి కవి బెల్లి యాదయ్య, సన్నీ అఖిల్, జయ వాహిని పాల్గొన్నారు.
మంచి సందేశాన్నిచ్చే చిత్రం
- Advertisement -
- Advertisement -
- Advertisement -