Wednesday, July 16, 2025

మంగళవారం రాశిఫలాలు (15-07-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన యత్నములకు ఇతరుల పరపతిని నమ్ముకోవడం కన్నా స్వయంకృషి చేయడం ఉత్తమమని గ్రహించండి మేలు కలుగుతుంది.

వృషభం – వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సెంటిమెంటు వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిథునం – అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఓర్పుతో ముందుకు సాగుతారు.

కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు. కాలానుగుణంగా ప్రవర్తించడమే విజయానికి మార్గమని గుర్తించండి. సంతాన క్షేమం, పురోభివృద్ధి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

సింహం – అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. ఎవరిని లెక్క చేయక మీ పనిని మీరు సక్రమంగా నిర్వహించి వృత్తి- ఉద్యోగాలలో లాభపడతారు.

కన్య – శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతను  ఇస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయపరంగా చర్చలు సాగిస్తారు. తరతమ భేదం లేకుండా అందర్నీ కలుపుకొని పనిచేస్తారు.

తుల – ప్రతిబంధకాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం.

వృశ్చికం – అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనుస్సు – ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు అందుకుంటారు.

మకరం – పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

కుంభం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం.

మీనం – తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News