- Advertisement -
హైదరాబాద్: కొంపల్లిలోని మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి లభించింది. డ్రగ్స్ కేసులో ఎస్ఐబి ఎఎస్ పి వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజను పోలీసులు అరెస్టు చేశారు. డిచ్పల్లి డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. రాహుల్ కోసం డిచ్పల్లి పోలీసులు పిటి వారెంట్ కూడా జారీ చేశారు. నిజామాబాద్లోనూ గతంలో డ్రగ్స్ కేసులో రాహుల్ ను సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని పలు పబ్బులు, నగర శివార్లలోని ఫాంహౌజులకు సూర్య, హర్ష డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మల్నాడు డ్రగ్ పార్టీలో కేసులో ఇప్పటికే మల్నాడు రెస్టారెంట్ యాజమాని సూర్య, హర్ష అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ మల్నాడు యాజమానితో కలిసి డగ్స్ దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు.
- Advertisement -