Wednesday, July 16, 2025

నిమిష ఉరి వాయిదాపై కుటుంబ సభ్యుల హర్షం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష అమలును యెమెన్ అధికారులు వాయిదా వేయడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిమిష ఉరిని ఆపేందుకు భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు కలిసికట్టుగా చేస్తున్న కృషిపట్ల ఆమె భర్త సంతృప్తి వ్యక్తం చేశారు.‘నిమిష ఉరి అమలు వాయిదా పడింది. అది చాలా మంచి వార్త. దీనిపై మేము ఎంతో సంతోషించడంతో పాటుగా ఊరట చెందుతున్నాం. ఆమె ఉరిశిక్ష అమలును తప్పించి, సురక్షితంగా ప్వదేశానికి తీసుకువచ్చే కృషి కొనసాగుతుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను’ అని నిమిష భర్త టోనీ థామస్ పిటిఐతో అన్నారు.

ఈ విషయంలో మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురు ఉందని ఆయన చెప్తూ, ఈ విషయాలేమీ ఆ బాలికకు తెలియనివ్వడం లేదనిచెప్పారు. వాస్తవానికి నిమిష ఉరిని బుధవారం అమలు చేయాల్సి ఉండగా, భారత ప్రభుత్వం, యెమెన్‌లోని మతపెద్దల జోక్యంతో అక్కడి అధికారులు దాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News