Wednesday, July 16, 2025

ఆర్డినెన్స్ ఆమోదం పొందిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి: ఆర్. కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్‌ల అమలుపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే గవర్నర్ ఆమోదం పొంది కాలయాపనకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌ల ఆర్డినెన్స్ అమలు, న్యాయపరమైన అంశాలపై మంగళవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బిసి సంక్షేమ సంఘం, అడ్వకేట్ జెఎసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం -2018లోని సెక్షన్ 285(ఎ)లో పలు సవరణలు చేస్తూ ఫైలును రూపొందించారని, దాన్ని ఏక్షణమైనా గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని, గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని కృష్ణయ్య తెలిపారు. ఆర్డినెన్స్‌తో పాటు నవ రించిన చట్టానికి అనుగుణంగా ఎన్నికల్లో రిజ ర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక జిఓను విడు దల చేస్తారని ఆ జిఓలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని కృష్ణయ్య తెలిపారు.

ఈ నెల 25 లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి, సెప్టెంబరు 30 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచిం చిందని, ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని ఆ వెంటనే ఎన్నికల ప్రకటన చేయాలన్నారు. వీటిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకొనే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేవియట్ పిటిషన్లు వేయాలని కృష్ణయ్య కోరారు. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా బిసిల కేసు గెలిచే అవకాశం ఉందన్నారు. జనాభా లెక్కలు, అసెంబ్లీలో చట్టం, సుప్రీంకోర్టు ఈడబ్లు ఓ కేసులో 50 శాతం సీలింగ్ ఎత్తివేసినందున ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం ఉందన్నారు.

చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోదాలు లేవని, సుప్రీం కోర్టులో కేసు గెలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, నీలం వెంకటేష్, పగిళ్ల సతీష్, అనంతయ్య, జెల్ల నరేందర్, రాజేందర్ నర్సింహ గౌడ్, న్యాయవాదులు రమేష్ బాబు విశ్వనాథుల, నాగుల శ్రీనివాస్ యాదవ్, అశోక్ కుమార్ యాదవ్, దేవేందర్, నవీన్ కుమోర్, అంజయ్య, అఖిల్ కుమార్, జి.వినోద్ కుమార్, టి. రంగచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News