Thursday, July 17, 2025

కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు: మంత్రి హర్ష మల్హోత్రా

- Advertisement -
- Advertisement -

అధికారులకు కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఆదేశం
మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకా లు, అభివృద్ధి పనులపై మంగళవారం సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నిర్ణీత సమయంలో పథకాలు లబ్ధిదారులకు చేరేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 117 ఆస్పిరేషనల్ జిల్లాలను గుర్తించిందని, ఆసిఫాబాద్ జిల్లా కూడా ఆస్పిరేషనల్ జిల్లాకు ఎంపికైందని తెలిపారు. ప్రధానమంత్రి సంకల్పం ప్రకారం ప్రతి ఆస్పిరేషనల్ జిల్లాలో నీతి ఆయోగ్ ద్వారా గిరిజనులకు మౌలిక వసతులు కల్పనకు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు కేంద్ర మంత్రులు పర్యటించి అమ లు చేస్తున్న పథకాలపై లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రధానమంత్రి జన్ మం పథకంలో భాగంగా పివిటిజి గిరిజనుల గ్రామాలలో మౌలిక వసతులు, ఇండ్లు, తాగునీరు, రహదారులు, వైద్య సేవలు, సామాజిక భవనాలు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ జల్ మిషన్ కింద శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అర్హులైన వారందరికీ 100 రోజులు పనిని కల్పించాలని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన రహదారుల పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సమ్మన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ కింద అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద డైరీ ఫామ్, క్యాటల్ చెట్ల నిర్మాణాలు చేపట్టాలని, పోషణ్ అభియాన్ కింద గర్భిణులు, బాలింతలు, బరువు, ఎత్తు తక్కువ ఉన్న వారిని గుర్తించి వారికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని కోరారు. స్వచ్ఛ అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

జిల్లాలో 100 శాతం వైద్యులు, నర్సులు, సిబ్బంది ఖాళీలు లేకుండా భక్తి చేయాలని, అర్హులైన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ కింద పివిటిజిలు 3 వేల 500 కుటుంబాలకు అందరికీ నివాస గృహాలు నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ఎంఎల్‌ఎలు పాల్వాయి హరీష్ బాబు, కోవ లక్ష్మి, అడిషనల్ ఎస్‌పి చిత్తరంజన్, కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి భరత్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News