Friday, July 18, 2025

కశ్మీర్ లోయలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

గత 36గంటలుగా కశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అమరనాథ్ యాత్రను గురువారం నిలిపివేసినటు అధికారులు తెలిపారు. జమ్మూ, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మరింతగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం గందేర్‌బల్ జిల్లా బల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగి పడ్డంతో ఓ మహిళా యాత్రికురాలు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గురువారం నాడు పహల్‌గామ్,

బల్తాల్ బేస్ క్యాంపులనుంచి యాత్రను రద్దు చేసినట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిదూరి తెలిపారు. అయితే నిన్న రాత్రి పంజతామి క్యాంప్‌లో బస చేసిన యాత్రికులను మాత్రం తగినంత మంది బిఆర్‌ఓ, మౌంటెన్ రెస్కూ టీమ్‌లను నియమించిన తర్వాత బల్తాల్‌కు వెళ్లడానికి అనుమతించినట్లు ఆయన చెప్పారు. యాత్ర మార్గాల్లో దారులను క్లియర్ చేయడానికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పెద్ద సంఖ్యలో సిబ్బందిని, యంత్రాలను నియోగించిందని, బహుశా వాతావరణం అనుకూలిస్తే శనివారం రెండు బేస్ క్యాంపులనుంచి యాత్ర తిరిగి ప్రారంభం కావచ్చని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News