మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ మీడియా అకాడమీ అధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణశిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్ అకాడమీ సెక్రటరీ ఎన్.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈమేరకు గురువారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..గత ఐదేళ్లుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో నూతన జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ శిక్షణాశిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో హైదరాబాద్ నగరం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ అడిటోరియంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిష్ణాతులైన జర్నలిస్టు ప్రముఖులచే ఈశిక్షణను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత జూన్ నెలలో పేర్లు నమోదు చేసుకున్న జర్నలిస్టులు మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. గుర్తింపు కలిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వారికి శిక్షణనందించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల శిక్షణను పూర్తిచేసుకున్న వారికి మీడియా అకాడమీ తరపున సర్టిఫికెట్స్ జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు జూలై 22వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.