మన తెలంగాణ/భీమ్‌గల్/వేల్పూరు: బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. వేల్పూర్ పట్టణంలో ఉదయం నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం 6 గంటల నుండి వేల్పూర్‌కు చేరుకోగా తెరాస నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటి బాట పట్టారు. నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు వేల్పూరు మండలంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంది. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ నేత రాష్ట్ర గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డిలపై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితులకు న్యాయం చేయలేదని కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో వేల్పూర్‌లో ప్రశాంత్ రెడ్డికి కను విప్పు కార్యక్రమం నిర్వహించగా మాటమాటా పెరిగి దాడి జరిగింది. దేవేందర్ రెడ్డి అతని అనుచరులను పోలీసు రక్షణ కల్పించి అక్కడ నుంచి స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ నేతలపై బిఆర్ఎస్ కార్యకర్తల దాడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -