యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్న సిఎం
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాటి పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో సిఎం టూర్‌ను సక్సెస్ చేసేందుకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సిఎం పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై మంత్రి జూపల్లి సమీక్ష జరిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పర్యటన సజావుగా జరిగేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్డూరి లక్ష్మణ్, ఎంపి మల్లు రవి, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
సిఎం పర్యటన వివరాలు
మధ్యాహ్నం 1 గంటలకు బేగం పేట ఏయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు జటప్రోలుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.55 గంటలకు జటప్రోలు మదనగోపాల స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన, మధ్యాహ్నం 2.20 గంటల నుంచి ప్రసంగాలు, సాయంత్రం 4.15 గంటలకు వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళల స్వయం సహాయ సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తారు.
జటప్రోలులో సిఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -