Sunday, August 31, 2025

స్నేహితులతో రన్నింగ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థి కుప్పకూలి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. డ్యాన్స్ చూస్తూ కుప్పకూలిపోవడం, నడుచుకుంటూ కుప్పకూలిపోవడంతో మనం చూస్తూనే ఉన్నాం. ఓ యువకుడు రన్నింగ్ చేస్తూ కుప్పలిపోయాడు. ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నాగలపురం మండలంలో జరిగింది. సురటుపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడి కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం ప్రతి రోజు రన్నింగ్ చేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన స్నేహితులతో కలిసి రన్నింగ్‌కు వెళ్లాడు. కొంచెం దూరం పరుగు తీసిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటు రావడంతోనే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News